![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో...... రామలక్ష్మి, సీతాకాంత్ ని గుడికి తీసుకొని వెళ్తుంది. అక్కడ సీతాకాంత్ ఒక్కడి పేరున అర్చన చేపిస్తుంటే.. ఇద్దరం వచ్చాము కదా ఒక్కరికి అర్చన చేపిస్తున్నావని సీతాకాంత్ అడుగుగా.. మనం ఇద్దరం వేరు వేరు కాదని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు శ్రీలత సందీప్ లు లాయర్ తో మాట్లాడుతుంటారు. ఈ ఆస్తులన్ని మీ పేరున రావాలంటే సీతాకాంత్ రామలక్ష్మిలు చనిపోవాలి. చావు కూడ సాధారణంగా ఉండాలి. అప్పుడే ఆస్తులు కుటుంబ సభ్యులు అయినా మీకూ వస్తుందని లాయర్ చెప్తాడు.
రామలక్ష్మి, సీతాకాంత్ లు హారతి తీసుకుంటుంటే అప్పుడే హారతి పోతుంది. దాంతో రామలక్ష్మి టెన్షన్ పడుతుంటే.. గాలికి వెళ్ళిందని సీతాకాంత్ చెప్తాడు. రామలక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ దేవుడికి మొక్కుకుంటుంది. గుడి మూసేసే టైమ్ అవుతుంది వెళ్ళండి అని పంతులు అనగానే.. మేమ్ ఈ రోజు ఇక్కడే పడుకుంటామని రామలక్ష్మి చెప్పగానే.. పంతులు సరే అంటాడు. సిరికి శ్రీవల్లి జ్యూస్ తీసుకొని వస్తుంది. వద్దని సిరి అంటుంటే ధన నేను తాగిస్తానని అంటాడు.
రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడి లో పడుకుంటారు. రామలక్ష్మికి సీతాకాంత్ కథ చెప్తుంటాడు. దాంతో రామలక్ష్మి నిద్రలోకి జారుకుంటుంది. మరొకవైపు సిరికి నొప్పులు మొదలవుతాయి. ధన సీతాకాంత్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దాంతో సీతాకాంత్ కంగారుగా వెళదాం పదా అని రామలక్ష్మి అంటుంటే.. వద్దని రామలక్ష్మి అంటుంది. ఈ ఒక్క రోజు ఆగండి అంటూ రామలక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంది. సీతాకాంత్ కోప్పడడంతో స్వామి చెప్పిన విషయం సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |